-->

బిక్షాటన చేస్తూ... ఆలయ నిర్మాణానికి ₹1.83 లక్షల విరాళం

రాయచూరులో తెలంగాణ వృద్ధురాలి త్యాగం, భక్తి కేరింతలు


రాయచూరు: మనసు పెద్దదైతే దానం కూడా మహత్తరమవుతుంది అనే విషయాన్ని తెలంగాణకు చెందిన వృద్ధురాలు రంగమ్మ తన కర్మతో చాటిచెప్పింది. కొన్నేళ్ల క్రితం కర్ణాటక రాష్ట్రం రాయచూరుకు చేరుకున్న రంగమ్మకు ఎవరూ లేకపోవడంతో బిక్షాటన ద్వారానే జీవనం సాగిస్తోంది.

తన అవసరాలను తీర్చుకొని మిగిలిన డబ్బును రూపాయి రూపాయిగా జమ చేస్తూ వచ్చింది. ఇలా ఏళ్ల తరబడి కూడబెట్టిన మొత్తం ₹1.83 లక్షలను రాయచూర్‌ జిల్లా బిజనగేరి ఆంజనేయస్వామి ఆలయ నిర్మాణానికి విరాళంగా అందించింది.

రూ.కోట్లు సంపాదించే వారు కూడా వెయ్యి రూపాయలు ఇవ్వడానికి వెనకాడే ఈ రోజుల్లో, బిక్షాటన ద్వారానే సంపాదించి లక్షల రూపాయలు విరాళంగా ఇవ్వడం ప్రజలను ఆశ్చర్యపరచింది. రెండు రాష్ట్రాల భక్తులు, స్థానికులు రంగమ్మ భక్తి, త్యాగం, పెద్దమనసును అభినందిస్తున్నారు.

Blogger ఆధారితం.