-->

ఆదాయపు పన్ను చట్టం–2025కు రాష్ట్రపతి ఆమోదం వచ్చే ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి

ఆదాయపు పన్ను చట్టం–2025కు రాష్ట్రపతి ఆమోదం వచ్చే ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి


న్యూఢిల్లీ: దేశంలో పన్ను వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతూ ఆదాయపు పన్ను చట్టం–2025కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. దీంతో దాదాపు ఆరు దశాబ్దాలుగా అమల్లో ఉన్న ఆదాయపు పన్ను చట్టం–1961 రద్దుకానుంది. కొత్త చట్టం 2026 ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి రానుంది.

ఆగస్టు 12న పార్లమెంటు ఆమోదించిన ఈ బిల్లుకు రాష్ట్రపతి మంగళవారం గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చారు. ఆదాయపు పన్ను శాఖ ‘ఎక్స్‌’ వేదికలో తెలిపిన ప్రకారం, కొత్త చట్టం సరళమైన, పారదర్శకమైన, అనుకూలమైన ప్రత్యక్ష పన్ను విధానంను తీసుకురానుంది.

ప్రధాన అంశాలు:

  • 1961 చట్టంలోని 819 సెక్షన్లు536కు తగ్గింపు
  • 47 అధ్యాయాలు23 అధ్యాయాలు
  • 5.12 లక్షల పదాలు2.6 లక్షలకు తగ్గింపు
  • 39 కొత్త పట్టికలు, 40 సూత్రాలు చేర్పు
  • క్లిష్ట నిబంధనల తొలగింపు, భాషను సరళతరం

నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ కొత్త చట్టం అమల్లోకి వస్తే పన్ను చెల్లింపుదారులకు లెక్కలు, లావాదేవీలు మరింత సులభతరం అవుతాయి. చిన్న వ్యాపారాలు, మధ్యతరగతి వర్గాలకు స్పష్టత పెరగనుంది.

➡️ దేశ ఆర్థిక చరిత్రలో కీలక మలుపు కానున్న ఈ చట్టం 2026–27 ఆర్థిక సంవత్సరంలో అమలులోకి రానుంది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793