-->

20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

20 వేలు లంచం  తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి


కరీంనగర్ జిల్లా, ఆగస్టు 29: కరీంనగర్ జిల్లా వీణవంక మండలం, చల్లూరు గ్రామ పంచాయతీ కార్యదర్శి కుంబం నాగరాజు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు.

ఫిర్యాదుదారుడు నూతనంగా నిర్మించుకున్న ఇంటికి ఇంటి నంబర్ కేటాయించడానికి సహాయం చేస్తానని నాగరాజు రూ.20,000/- లంచం డిమాండ్ చేశాడు. సమాచారం అందుకున్న తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు దాడి చేసి, అతన్ని రెడ్ హ్యాండెడ్‌గా అరెస్ట్ చేశారు.

ఈ సందర్భంగా తెలంగాణ ACB ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వ ఉద్యోగి ఎవరు అయినా లంచం అడిగినట్లయితే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు ఫిర్యాదు చేయాలని కోరింది. అలాగే

  • WhatsApp: 9440446106
  • Facebook: Telangana ACB
  • X (Twitter): @TelanganaACB
  • Website: acb.telangana.gov.in

ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని తెలిపింది.

🔒 ఫిర్యాదుదారుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని అవినీతి నిరోధక శాఖ భరోసా ఇచ్చింది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793