రాజీవ్ గాంధీ 81వ జయంతి వేడుకలు ఘనంగా
భద్రాద్రి కొత్తగూడెం: భారతరత్న, మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి 81వ జయంతి సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిసిసి కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. డిసిసి అధ్యక్షుడు మహమ్మద్ గౌస్ మొనుద్దీన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.
ఈ సందర్భంగా టిపిసిసి సభ్యులు, సమిదాన్ బచావో సభ్యులు, తెలంగాణ రాష్ట్ర ఎస్సీ సెల్ కన్వీనర్ జేబీ శౌరి, టిపిసిసి జనరల్ సెక్రటరీ మోతుకూరి ధర్మారావు పాల్గొని రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి జయంతి వేడుకలను జరుపుకున్నారు.
నాయకులు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ దేశ చరిత్రలో మైలురాయిగా నిలిచారని గుర్తుచేశారు. 40 ఏళ్ల వయసులోనే ప్రధానమంత్రి పదవి చేపట్టి ఐటి రంగాన్ని దేశానికి పరిచయం చేసి, టెక్నాలజీ అభివృద్ధికి పునాది వేశారని అన్నారు. టెలికమ్యూనికేషన్స్, వాణిజ్య, రక్షణ, విమానయాన రంగాలలో సంస్కరణలు ప్రవేశపెట్టారని, విద్యలో సమానావకాశాల కోసం నేషనల్ పాలసీ ఫర్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చారని వివరించారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన నాయకుడి జ్ఞాపకం ఎల్లప్పుడూ నిలిచిపోతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ తంగెళ్ల లక్ష్మణ్, మాజీ ఎంపీటీసీ కసానబోయిన భద్రం, మాజీ సర్పంచ్ బానోత్ ఈశ్వర్ సింగ్, రాష్ట్ర సోషల్ మీడియా కోఆర్డినేటర్ వీరాపురం రామ్ లక్ష్మణ్, NSUI జిల్లా అధ్యక్షుడు అజ్మీరా సురేష్ నాయక్, జిల్లా మైనార్టీ ఉపాధ్యక్షుడు కరీం పాషా, పట్టణ ఓబిసిఎల్ అధ్యక్షుడు జయప్రకాష్, యువజన నాయకుడు గడ్డం రాజశేఖర్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఏలూరి రాందాస్, ఎలుక పెళ్లి లక్ష్మయ్య, ఆదరి కొమరయ్య, మాదా శ్రీరాములు, మూతి కనకయ్య, బానోత్ రామ్ కిషన్, మహిళా నాయకురాలు శివలక్ష్మి, మర్రి బాలమ్మ, వాంకులో జగదాంబ, ASJ జిల్లా అధ్యక్షుడు కరీం పాషా, మైనార్టీ నాయకులు మెహబూబ్ ఖాదరి, అలీముద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment