తెలంగాణలో భారీ వర్షాలు – ఐదు జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్న నేపథ్యంలో తెలంగాణ పాఠశాల విద్యాశాఖ అత్యవసర నిర్ణయం తీసుకుంది. భారీ వర్ష సూచనలను దృష్టిలో ఉంచుకుని వరంగల్, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని అన్ని పాఠశాలలకు బుధ, గురువారాలు సెలవులు ప్రకటించింది.
ఇక జీహెచ్‌ఎంసీ పరిధిలోని పాఠశాలల్లో మాత్రం ఈ రెండు రోజుల పాటు ఒంటిపూట బడులు మాత్రమే నిర్వహించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.
ఇదే సమయంలో, భారీ వర్షాల కారణంగా సంభవించవచ్చిన వరదలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి జిల్లా కలెక్టర్లు, ఇన్‌ఛార్జ్ మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి మూడు రోజులపాటు అన్ని శాఖల ఉద్యోగుల సెలవులు రద్దు చేయాలని ఆదేశించి, ప్రజల రక్షణ చర్యల్లో ఎవరూ నిర్లక్ష్యం వహించరాదని హెచ్చరించారు. హైదరాబాద్‌లో వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో హై అలర్ట్ అమలు చేయాలని సూచించారు.
Post a Comment