-->

ఫోన్‌పే ద్వారా లంచం తీసుకున్న సర్వేయర్, ప్రైవేట్ వ్యక్తిపై ACB కేసు

ఫోన్‌పే ద్వారా లంచం తీసుకున్న సర్వేయర్, ప్రైవేట్ వ్యక్తిపై ACB కేసు


పెద్దపల్లి: భూమి సర్వే పంచనామా ప్రతిని అందించడానికి రూ.10,000 లంచం తీసుకున్న కేసులో పెద్దపల్లి మండల సర్వేయర్ పైండ్ల సునీల్, ప్రైవేట్ వ్యక్తి కటుకూరి రాజేందర్ రెడ్డి లపై తెలంగాణ అవినీతి నిరోధకశాఖ అధికారులు కేసు నమోదు చేశారు.

అధికారుల సమాచారం ప్రకారం, ఫిర్యాదుదారుని నుండి ఫోన్‌పే ద్వారా లంచం స్వీకరించినట్లు ఆధారాలు లభించాయి. ఈ మేరకు ఇద్దరిపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ప్రజలకు సూచన: ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా లంచం కోరినట్లయితే వెంటనే టోల్‌ఫ్రీ నెంబర్ 1064కి కాల్ చేయవచ్చు. అలాగే WhatsApp (9440446106), Facebook (Telangana ACB), X (@TelanganaACB) మరియు వెబ్‌సైట్ (acb.telangana.gov.in) ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.

Blogger ఆధారితం.