జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నేతన్నలకు హృదయపూర్వక శుభాకాంక్షలు
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నేతన్నలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. చేనేత రంగానికి పూర్వ వైభవం తీసుకురావడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు. రైతులకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో, నేతన్నలకూ అదే స్థాయిలో ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు.
పాత బకాయిల విడుదల, లక్ష రూపాయల వరకు రుణ మాఫీ వంటి చర్యలతో పాటు, తెలంగాణ చేనేత అభయ హస్తం, నేతన్న పొదుపు, నేతన్న బీమా, నేతన్నకు భరోసా వంటి పథకాలు అమలులో ఉన్నాయని సీఎం తెలిపారు. చేనేత కార్మికుల సమగ్ర అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.
Post a Comment