-->

గాలిలో ఆగిపోయిన గల్ఫ్ కార్మికుని గుండె మృత్యువుతో ముడిపడిన ప్రయాణం

 

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన శ్రీరాముల శ్రీధర్

జగిత్యాల, కోరుట్ల |విదేశాల్లో జీవనోపాధి కోసం వెళ్లిన ఓ గల్ఫ్ కార్మికుని గుండె అంతిమంగా గాలిలోనే ఆగిపోయింది. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన శ్రీరాముల శ్రీధర్ గత కొన్ని సంవత్సరాలుగా గల్ఫ్ దేశమైన దమములో జీవనం సాగిస్తున్నాడు.

నిన్న శ్రీధర్ దమములో నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో అనారోగ్యానికి గురయ్యాడు. మార్గమధ్యంలో శ్వాస ఆడటం లేదని సిబ్బందికి తెలియజేయడంతో వెంటనే విమానం ముంబై విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేయించింది.

వెంటనే స్పందించిన వైద్య బృందం అతనికి CPR (హృదయ మసాజ్) చేయగా, అప్పటికే గుండె దాదాపుగా నిలిచిపోయినట్లు గుర్తించారు. అపార ప్రయత్నాలు చేసినప్పటికీ అతనిలో ఎలాంటి స్పందన లేకపోవడంతో వైద్యులు మరణించినట్లు ప్రకటించారు.

శ్రీధర్ మృతిచెందడం సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతునికి భార్యతో పాటు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. జీవనోపాధి కోసం విదేశాలకు వెళ్లిన తండ్రి ఇక తిరిగి రాడన్న వార్తతో కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి.

Blogger ఆధారితం.