-->

విద్యార్థులకు ముఖ్య అలర్ట్ – పలు జిల్లాల్లో నేడు విద్యాసంస్థలకు సెలవులు

 విద్యార్థులకు ముఖ్య అలర్ట్ – పలు జిల్లాల్లో నేడు విద్యాసంస్థలకు సెలవులు

విద్యార్థులకు ముఖ్య అలర్ట్ – పలు జిల్లాల్లో నేడు విద్యాసంస్థలకు సెలవులు


హైదరాబాద్, ఆగస్టు 28 : తెలంగాణలో కుండపోత వర్షాలు కురుస్తుండటంతో ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని పలు జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు అధికారులు సెలవులు ప్రకటించారు.

భారీ వర్షాల ప్రభావం అధికంగా ఉన్న కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, నిర్మల్, కొమురం భీం జిల్లాల్లో విద్యాసంస్థలకు ఒకరోజు సెలవు అమల్లోకి వచ్చింది. వాతావరణ శాఖ ఇప్పటికే ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. కొన్ని చోట్ల రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదవుతోంది.

కామారెడ్డి జిల్లాలో గత కొన్ని గంటల్లోనే దాదాపు 500 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ నిపుణులు వెల్లడించారు. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించడంతో గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో రాకపోకలు తీవ్రంగా అడ్డంకులు ఎదుర్కొంటున్నాయి.

అదే విధంగా మెదక్, సిద్దిపేట, నిర్మల్ జిల్లాల్లోనూ ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. నిర్మల్ జిల్లాలో నదులు ప్రమాదకర స్థాయికి చేరాయి.

ఈ ఐదు జిల్లాలతో పాటు ఇతర జిల్లాల కలెక్టర్లు కూడా స్థానిక పరిస్థితులను బట్టి విద్యాసంస్థలకు సెలవులపై నిర్ణయం తీసుకునే అధికారం కలిగినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లరాదని, ముఖ్యంగా వరద నీరు ప్రవహిస్తున్న ప్రాంతాలకు దూరంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

రాష్ట్రంలో సహాయక చర్యల కోసం విపత్తు నిర్వహణ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయి. వాతావరణ శాఖ అంచనా ప్రకారం ఈ వర్షాలు మరో రెండు నుండి మూడు రోజులు కొనసాగే అవకాశం ఉంది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాల కలెక్టర్లతో ఎప్పటికప్పుడు మాట్లాడి పరిస్థితులను తెలుసుకుంటున్నారు. మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అప్రమత్తంగా ఉండాలని, ఏ విపత్కర పరిస్థితి తలెత్తినా వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793