-->

వచ్చే ఏడాది జనవరిలోనే ఇంటర్ పరీక్షల ప్రణాళిక ❓

వచ్చే ఏడాది జనవరిలోనే ఇంటర్ పరీక్షల ప్రణాళిక ❓


హైదరాబాద్, ఆగస్టు 28: తెలంగాణలో ఈసారి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను జనవరిలోనే నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. సాధారణంగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి–మార్చి నెలల్లో జరిగే ఈ పరీక్షలు ముందుగానే జరగనున్నాయి.

ఈ నిర్ణయం వల్ల విద్యార్థులకు జేఈఈ, నీట్, ఎమ్‌సెట్, సీయూఈటీ, యూజీ ప్రవేశ పరీక్షలకు తగినంత సమయం సిద్ధమయ్యేందుకు లభిస్తుందని విద్యా నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో 2026 జనవరి మధ్యలో లేదా ఫిబ్రవరి తొలి వారం నుంచి పరీక్షలు ప్రారంభించే అవకాశముందని అధికారులు సూచిస్తున్నారు.

🔹 ప్రైవేట్ కాలేజీలలో సిలబస్ అక్టోబర్–నవంబర్ నాటికే పూర్తవుతుంది. అనంతరం విద్యార్థులను రివిజన్, పోటీ పరీక్షల ప్రిపరేషన్ పై దృష్టి సారించేలా చేస్తారు.
🔹 దీంతో జాతీయస్థాయి పోటీ పరీక్షల్లో ఎక్కువ ర్యాంకులు ప్రైవేట్ విద్యార్థులకే వస్తున్నాయి. ఈ విషయాన్ని ఇటీవల జరిగిన సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రస్తావించారు.

కానీ, ప్రభుత్వ కాలేజీలలో సిలబస్ పూర్తి కావడంలో ఆలస్యం అవుతుండటంతో విద్యార్థులు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు ఇంటర్ బోర్డు పలు మార్పులు ప్రతిపాదించింది.

అదే సమయంలో, ఈసారి ఇంటర్ ఫలితాలను కూడా గతంలోకన్నా ముందుగానే విడుదల చేయాలని అధికారులు యోచిస్తున్నట్టు తెలుస్తోంది.


Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793