-->

నందమూరి బాలకృష్ణకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గౌరవం!

నందమూరి బాలకృష్ణకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గౌరవం!


భారతీయ సినీ రంగంలో ఐదు దశాబ్దాలుగా అప్రతిహతమైన సేవలందించిన నటసింహం నందమూరి బాలకృష్ణకు లండన్‌ ఆధారిత వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతిష్ఠాత్మక గుర్తింపుని ప్రకటించింది.

50 ఏళ్ల విజయవంతమైన సినీ ప్రయాణం, వరుస హిట్ చిత్రాలు, ప్రజాసేవా రంగంలో చూపుతున్న అంకితభావం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఆయన పేరును వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ యూకే గోల్డ్ ఎడిషన్‌లో నమోదు చేస్తున్నట్లు ఆ సంస్థ సీఈఓ సంతోష్ శుక్లా తెలిపారు.

బాలకృష్ణ "అఖండ", "వీరసింహారెడ్డి", "భగవంత్ కేసరి" వంటి చిత్రాలతో శతకోటి వసూళ్ల హ్యాట్రిక్ సాధించడం విశేషం. అలాగే, రాజకీయ రంగంలో వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజానీక విశ్వాసాన్ని గెలుచుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పద్మభూషణ్‌తో పాటు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్‌గా ఆయన అందిస్తున్న సేవలు విస్తృతంగా గుర్తింపు పొందుతున్నాయి.

ఈ గౌరవాన్ని ఆగస్టు 30న హైదరాబాద్‌లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు స్వయంగా బాలకృష్ణకు అందజేయనున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793