వినాయకుడి పూజ కోసం పూజారిని బైక్‌పై ఎత్తుకెళ్లిన యువకులు
సిద్దిపేట జిల్లా, ఆగస్టు 29 : వినాయక చవితి సందర్బంగా కోహెడ మండలంలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. గణేష్ ఉత్సవాల్లో ముందుగా తమ వినాయకుడి దగ్గర పూజ చేయించాలని రెండు గ్రూపులు పోటీపడ్డాయి. ఈ క్రమంలో పూజారిని ముందుగా తమవద్దకు తీసుకెళ్లాలని ఒక వర్గం యువకులు బైక్‌పై ఎక్కించి తీసుకెళ్లారు.
సాక్షులు చెబుతున్న వివరాల ప్రకారం, రెండు వర్గాల మధ్య మాటామాటా తీవ్రంగా పెరగడంతో, ఆ తగాదా క్షణాల్లోనే ఒక గ్రూప్ పూజారిని బైక్‌పై ఎక్కించుకుని వెళ్లిపోవడం గ్రామంలో హాట్ టాపిక్‌గా మారింది. పూజారిని తీసుకెళ్లిన గ్రూప్ మొదటగా పూజలు చేయించుకోవడంతో, మరో వర్గం అసహనం వ్యక్తం చేసింది.
స్థానికులు ఈ ఘటనను సరదాగా తీసుకుంటూ వీడియోలు చిత్రీకరించగా, అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పండుగ సందర్భంలో ఈ తరహా పోటీలు చర్చనీయాంశమవుతున్నాయి.
👉 అధికారులు ఈ ఘటనపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అయితే గ్రామంలో కొంత ఉద్రిక్తత నెలకొన్నట్లు సమాచారం.
Post a Comment