కొత్తగూడెం ఏరియాలో హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో గేటు మీటింగ్, నల్ల బ్యాడ్జీలతో నిరసన
కొత్తగూడెం ఏరియాలో సుమారు ఏడేళ్లుగా సర్ఫేస్ కౌన్సిలింగ్ నిర్వహించకపోవడాన్ని నిరసిస్తూ హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో కార్మికులు గేట్ మీటింగ్ నిర్వహించారు. మేనేజ్‌మెంట్ అన్యాయ చర్యలకు వ్యతిరేకంగా, కార్మికుల హక్కుల పరిరక్షణకు పలు అంశాలను లేవనెత్తుతూ ఉద్యమం చేపట్టారు.
హెచ్ఎంఎస్ నేతలు కార్మికులకు ఉద్దేశించి మాట్లాడుతూ, గతంలో ఎన్నోసార్లు వినతిపత్రాలు ఇచ్చినా మేనేజ్‌మెంట్ వైఖరిలో మార్పు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గుర్తింపు సంఘాల వైఫల్యం వల్ల కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మాయ మాటలతో మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తమైంది.
ప్రధానంగా ప్రస్తావించిన సమస్యలు:
- క్యాంటీన్లను ప్రైవేటుపరం చేయడం
- మెడికల్ అన్‌ఫిట్ కార్మికులకు సర్ఫేస్ జాబ్ ఇవ్వకుండా GA 1st కేటగిరికి కేటాయించడం
- ఇన్‌కమ్ టాక్స్ మినహాయింపు సాధించకపోవడం
- PVK సొసైటీ పారదర్శకత లోపించడంఇంక్రిమెంట్లలో విఫలం
- జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్ నిర్వహించకపోవడం
- డిప్యూటేషన్ల దుర్వినియోగం
- లాభాల వాటా ప్రకటించడంలో జాప్యం
- మెకానికల్ ఫోర్‌మెన్‌ల కన్ఫర్మేషన్ లెటర్ల జాప్యం
- మైనింగ్ సూపర్వైజర్ల ప్రమోషన్లు పెండింగ్‌లో ఉండడం
ఈ నేపథ్యంలో కార్మికుల ఆవేదనను బయటపెట్టేలా హెచ్ఎంఎస్ నాయకులు బహిరంగ లేఖలు, వాల్‌పోస్టర్ల ద్వారా ప్రచారం నిర్వహించారు. నిరసన భాగంగా PVK ఫై నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళన తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో హెచ్ఎంఎస్ అధ్యక్షుడు తిప్పారపు సారయ్య, జనరల్ సెక్రటరీ రియాజ్ అహ్మద్, ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఆంజనేయులు, బ్రాంచ్ సెక్రటరీ ఆసిఫ్, పిట్ సెక్రటరీ చిట్టిబాబు, ఆర్గనైజింగ్ సెక్రటరీ సందీప్, ఫీడ్ సెక్రటరీ పూర్ణచందర్, వర్క్‌షాప్ పిట్ సెక్రటరీ కరీం, కన్వీనర్ చంద్రశేఖర్, సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ కృష్ణ ప్రసాద్, కార్పొరేట్ బ్రాంచ్ సెక్రటరీ యాకూబ్ తదితరులు పాల్గొన్నారు.
Post a Comment