-->

వరలక్ష్మీ వ్రత సంకల్పం – జీవన సర్వస్వం

 

వ్రతం అంటే నియమం, సంకల్పం, దీక్ష, భక్తి, శ్రద్ధల సమ్మేళనం.

అష్టదిక్కుల మధ్యలో తల్లి గర్భంలో ఉండే శిశువు ఆరోగ్యంగా, సక్రమంగా పెరగాలంటే శక్తి అవసరం. ఆ శక్తికి ప్రతీక అష్టలక్ష్మీ తత్త్వం. మానవ జీవితంలో సంపూర్ణతకు అవసరమైన అపార ఐశ్వర్యాలకు సంకేతం అదే.

🍁 వరలక్ష్మీ వ్రతం అష్టకష్టాలను పారద్రోలే మహా వ్రతం. ఇది కేవలం ఒక సంప్రదాయ ఆచారం మాత్రమే కాదు – జీవిత తాత్వికతను ప్రతిబింబించే ఓ గొప్ప ఆధ్యాత్మిక మార్గం. ఈ వ్రతాన్ని మొదటగా చారుమతీ దేవి, తన భర్త క్షేమార్థం స్కాంద పురాణంలోని సూచనలతో ఆచరించినట్లు పురాణ కధనాలు పేర్కొంటున్నాయి. భర్తకు ఆయురారోగ్యాలు, కుటుంబ సౌఖ్యం పొందినట్లు చెబుతాయి.

🍁 వ్రతంలో కలశ పూజ ప్రధానంగా ఉంటుంది. కలశం అష్టలక్ష్ముల సమ్మిళిత శక్తికి ప్రతీక. ఇది ఇంటికి ఆయుష్షుని, శ్రేయస్సును అందించేదిగా భావిస్తారు. లక్ష్మీదేవి అనేక రూపాలలో వ్యక్తమవుతుంది – అది కేవలం ధనం కలిగించేవారు కాదు, జీవన శక్తికి ఆధారంగా ఉన్న మాతృశక్తి.


అష్టలక్ష్ముల తత్త్వ సమన్వయం

  1. ఆదిలక్ష్మి – ఆదిశక్తి రూపం, ఆధారమైన శాంతియుత ధ్యానశక్తి.
  2. ధాన్యలక్ష్మి – పంచుకోవడంలో ఉన్న ఐశ్వర్య తత్త్వం.
  3. గజలక్ష్మి – శక్తి-శాంతి సమన్వయం; అహంకార నిగ్రహానికి సూచిక.
  4. సంతానలక్ష్మి – సంతతి మాత్రమే కాక ధర్మపరంపరకు ప్రతీక.
  5. ధనలక్ష్మి – సంపదకు ప్రతీక, వినయవంతమైన వినియోగానికి గుర్తింపు.
  6. వీరలక్ష్మి – ధైర్యానికి, న్యాయం కోసం నిలబడే తత్వానికి చిహ్నం.
  7. విద్యాలక్ష్మి – విజ్ఞాన సాధనకు, సత్య మార్గాన నడిపించే శక్తి.
  8. విజయలక్ష్మి – అంతరంగ విజయానికి ప్రతీక; స్వీయ నియంత్రణకు మార్గదర్శకురాలు.

🌺 వ్రతం – ఆచారం కాదు, ఆత్మవైభవ మార్గం

శ్రద్ధగా తలపెట్టిన వ్రతం మనిషిలోని స్వార్థాన్ని తొలగించి, లోపలి జ్ఞానదీపాన్ని వెలిగిస్తుంది. లక్ష్మీ పాదాలను అలంకరించడమే కాదు – ఆమె తత్త్వాన్ని అనుసరించాలన్న తపన కలగాలి. సంపద, విజయం, ధైర్యం, విద్య – ఇవన్నీ మనిషి జీవితాన్ని సమృద్ధిగా తీర్చిదిద్దే శక్తులు.


🌿 శ్రావణ మాసం – భక్తి, శాంతికి ప్రతీక

ప్రకృతి పునరుజ్జీవాన్ని పొందే ఈ మాసం, మనుషుల్లోనూ శాంతి, శ్రద్ధ, భక్తి మొదలవేవి జెరుకిస్తాయి. ఈ మాసంలోని శుక్ల పక్ష శుక్రవారం వరలక్ష్మీ వ్రతం పూజగా మాత్రమే కాక, జీవన విలువల పునర్నిర్మాణానికి మార్గం.


మహాలక్ష్మీ అనుగ్రహం అందరికీ ఉండాలని, ఈ వ్రతాన్ని నిజమైన జీవన తత్వంగా అనుసరించాలని మనస్పూర్తిగా కోరుకుందాం.

🔱 అంతర్యామి తత్వాన్ని తెలుసుకునే సంకల్పంతో, వ్రతాన్ని అనుసరిద్దాం... 🔱

Blogger ఆధారితం.