తెలంగాణ పోరాట యోధుడు జయశంకర్: సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ప్రొఫెసర్ కె. జయశంకర్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జయంతి సందర్భంగా ఘనంగా స్మరించారు. జయశంకర్ సేవలను నేటి తరానికి చిరస్మరణీయంగా నిలిపేందుకు ప్రతి ఒక్కరికి బాధ్యత ఉందని ఆయన పేర్కొన్నారు.
"తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు రూపం ఇచ్చిన నాయకుడు జయశంకర్. ఆయన స్వరాష్ట్ర కలను నిజం చేయడంలో మార్గదర్శకుడిగా నిలిచారు. తెలంగాణ జాతిపితగా ఆయన్ను రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ గౌరవంతో గుర్తించుకుంటారు" అని సీఎం రేవంత్ అన్నారు.
తెలంగాణ అనేది కేవలం భౌగోళిక ఉద్యమం మాత్రమే కాదని, అది ప్రజల హక్కుల కోసం సాగించిన దీర్ఘకాలిక పోరాటమని చెప్పారు. "జయశంకర్ గారు పదే పదే గణాంకాలతో, వాస్తవాలతో ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయాన్ని ప్రపంచానికి చాటారు. ఆరు దశాబ్దాల పాటు ఉద్యమాన్ని సజీవంగా ఉంచారు. ఆయన కలల జెండా... భవిష్యత్తు ఏజెండా అయ్యింది" అని సీఎం రేవంత్ పేర్కొన్నారు.
అంతేకాకుండా, జయశంకర్ విద్యారంగంలో కూడా గొప్ప మార్గదర్శిగా నిలిచారని, ఆయన విశ్వాసాలు, భావనలు నేటి యువతకు మార్గం చూపాలని సీఎం ఆకాంక్షించారు..
Post a Comment