-->

లేగ దూడపై యువకుడి లైంగిక దాడి – మెదక్‌లో కలకలం

లేగ దూడపై యువకుడి లైంగిక దాడి – మెదక్‌లో కలకలం


మెదక్ జిల్లా: సెప్టెంబర్ 23 : మానవత్వాన్ని మంటగలిపే మరో దారుణ ఘటన మెదక్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. పశువులపై జరుగుతున్న పైశాచిక దాడులు ఆందోళన కలిగిస్తున్న తరుణంలో, చిన్నశంకరంపేట మండలం మీర్జాపల్లి గ్రామంలో ఓ యువకుడు ఏడాది వయసున్న లేగదూడపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.

రైతు సిద్ధిరాములు తన వ్యవసాయ క్షేత్రంలోని షెడ్డులో పశువులను కట్టేసి ఇంటికి వెళ్లగా, అదే ప్రాంతంలో పనిచేస్తున్న బీహార్‌కు చెందిన రోహిత్ అనే యువకుడు సోమవారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో షెడ్డులోకి ప్రవేశించి దారుణానికి ఒడిగట్టాడు.

అయితే షెడ్డులో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరా ఈ ఘోరాన్ని రికార్డ్ చేయడంతో నిందితుడి దారుణం బయటపడింది. దృశ్యాలను గమనించిన రైతు అక్కడికే చేరుకుని రోహిత్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని గ్రామస్తుల సహకారంతో దేహశుద్ధి చేసి, అనంతరం పోలీసులకు అప్పగించాడు.

రైతు ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో గ్రామంలో కలకలం రేగగా, మూగజీవాలపై ఇటువంటి అమానుష దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.

👉 స్థానికులు నిందితుడికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు.


Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793