ఎల్లారెడ్డి మైనారిటీ ఫంక్షన్ హాల్‌లో మెగా రక్తదాన శిబిరం
కామారెడ్డి, సెప్టెంబర్ 12: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో ఆదివారం మెగా రక్తదాన శిబిరం జరగనుంది. ఎల్లారెడ్డి మైనారిటీ వెల్ఫేర్ కమిటీ అధ్యక్షులు, మాజీ జడ్పిటిసి గయాజీద్దిన్ ఆధ్వర్యంలో, కమిటీ సభ్యుల సహకారంతో ఈ శిబిరాన్ని మైనారిటీ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించనున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్‌క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు, కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షుడు జమీల్ హైమాద్ ముఖ్యంగా పాల్గొననున్నారు. యువత పెద్ద ఎత్తున ముందుకు వచ్చి రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని వారు పిలుపునిచ్చారు.
రక్తదానం చేయడం వలన గుండె జబ్బులు, క్యాన్సర్, కొలెస్ట్రాల్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం తగ్గిపోతుందని పలు సర్వేలు నిర్ధారించాయని డాక్టర్ బాలు తెలిపారు. రక్తదానం పట్ల ఉన్న అపోహలను విడనాడి సమాజానికి ఉపయోగపడేలా అందరూ చురుకుగా పాల్గొనాలని సూచించారు.
ఈ రక్తదాన శిబిరం ద్వారా అత్యవసర పరిస్థితుల్లో అవసరమైన వారికి రక్తం అందుబాటులో ఉండేలా చేయడం ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు వెల్లడించారు.
Post a Comment