ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12: భారతదేశ 15వ ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ శుక్రవారం ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు.
ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తదితర ప్రముఖులు హాజరయ్యారు. కార్యక్రమం అట్టహాసంగా సాగింది.
ఇక మంగళవారం జరిగిన ఉప రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌లో ఎన్డీయే అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ 152 ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆయన ప్రత్యర్థి మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి. సుదర్శన్‌రెడ్డిని ఓడించారు.
రాధాకృష్ణన్ ఉప రాష్ట్రపతిగా ఎన్నిక కావడంతో దక్షిణ భారత దేశానికి మరోసారి ప్రతిష్టాత్మకమైన పదవి లభించింది.

Post a Comment