ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ – మావోయిస్ట్ టాప్ లీడర్ మృతి
సెప్టెంబర్ 12: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం గరియాబంద్ అటవీ ప్రాంతం గురువారం ఉదయం రణరంగంగా మారింది. భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య గంటల పాటు తీవ్ర ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఇప్పటి వరకు పది మంది మృతి చెందినట్లు సమాచారం. వీరిలో మావోయిస్ట్ కేంద్ర కమిటీ కీలక సభ్యుడు మనోజ్ అలియాస్ మోందం బాలకృష్ణ కూడా ఉన్నట్లు నిఘా వర్గాలు నిర్ధారించాయి.
రాయ్‌పూర్ రేంజ్ ఐజీ అమ్రేష్ మిశ్రా ఎన్‌కౌంటర్‌ను ధృవీకరించారు. “గరియాబంద్‌లో ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. మరికొందరు మావోయిస్టులు కూడా మృతిచెందివుండవచ్చు” అని తెలిపారు. ప్రాంతంలో కూంబింగ్ ఆపరేషన్ మరింత బలపరిచినట్లు భద్రతా వర్గాలు తెలిపాయి.
మందుపాతర పేలి ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు గాయాలు
ఇక దంతేవాడ జిల్లా పల్లి–బార్సూర్ రోడ్డులో మావోయిస్టులు అమర్చిన ప్రెజర్ ఐఈడీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు సీఆర్పీఎఫ్ సిబ్బంది గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒకరు ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారి కాగా, మరొకరు బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజబుల్ స్క్వాడ్ టీమ్ జవాన్‌గా గుర్తించారు.
గాయపడిన సిబ్బంది సీఆర్పీఎఫ్ 195 బెటాలియన్ కు చెందినవారని ఆయన తెలిపారు.
🔻 ఎన్‌కౌంటర్, పేలుడు ఘటనలతో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం మరోసారి ఉలిక్కిపడింది. భద్రతా బలగాలు ఆపరేషన్లను మరింత కఠినతరం చేశాయి.

Post a Comment