-->

ట్రాన్స్‌ఫార్మర్‌ల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలి: ఎంఐఎం అధ్యక్షుడు మొహీద్ పటేల్

 

ట్రాన్స్‌ఫార్మర్‌ల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలి: ఎంఐఎం అధ్యక్షుడు మొహీద్ పటేల్

నారాయణఖేడ్ : నారాయణఖేడ్ పట్టణంలోని ముస్లిం శ్మశానవాటికలో పలు సమస్యలను ఎంఐఎం పట్టణ అధ్యక్షుడు, న్యాయవాది మొహీద్ పటేల్ ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శ్మశానవాటిక ప్రధాన గేటు వద్దనే ఏర్పాటు చేసిన ట్రాన్స్‌ఫార్మర్‌ల చుట్టూ రక్షణ కంచ లేకపోవడం వల్ల ప్రజలకు ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు. ప్రజల ప్రాణాలను హరిస్తున్న ఈ నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. తక్షణమే ట్రాన్స్‌ఫార్మర్‌ల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి భద్రతా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అధికారులు వెంటనే స్పందించి చర్యలు చేపట్టకపోతే, ప్రజలతో కలిసి ఆందోళనకు దిగుతామని మొహీద్ పటేల్ హెచ్చరించారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793