ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి సందర్బంగా ఘన నివాళులు
ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా ప్రముఖ వ్యాపారి, సామాజికవేత్త ఎం. శ్రీనివాస్ కుమార్ ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, “కాళోజీ జన్మదినాన్ని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకోవడం ప్రతి తెలంగాణ వాసికి గర్వకారణం” అని పేర్కొన్నారు.
కాళోజీ తెలంగాణ కోసం అహర్నిశలు కృషి చేసి, తన సాహిత్యం, రచనల ద్వారా ప్రజల్లో చైతన్యం రగిలించారని తెలిపారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా అణగారిన వర్గాల తరపున గళమెత్తి, ప్రజా సమస్యలను సాహిత్యంలో ప్రతిబింబిస్తూ పోరాడారని ఆయన గుర్తుచేశారు.
తెలంగాణ యాస, పలుకుబడులు, సాంస్కృతిక విలువలను కాపాడటంలో కాళోజీ అపారమైన కృషి చేశారని శ్రీనివాస్ కుమార్ కొనియాడారు. ప్రజల పక్షాన నిలబడి నిజాం దురాగతాలను ప్రశ్నించిన కాళోజీ నిజమైన ప్రజాకవి అని పేర్కొన్నారు. అలాంటి మహనీయుని జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకోవడం సంతోషకరమని ఆయన అభిప్రాయపడ్డారు.

Post a Comment