4 లక్షలు తీసుకుంటూ ఏసీబీ వలలో నార్సింగి మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారి
హైదరాబాద్, నార్సింగి: హైదరాబాద్ నార్సింగి పురపాలక సంఘం పట్టణ ప్రణాళిక శాఖలో పనిచేస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారి ఎస్. మణి హారిక లంచం స్వీకరిస్తూ తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులకు పట్టుబడ్డారు.
ఫిర్యాదుదారునికి చెందిన ఓ ప్లాటు క్రమబద్ధీకరణ (LRS ప్రొసీడింగ్స్) జారీ చేసేందుకు మరియు దానిని ప్రాసెస్ చేయడానికి మణి హారిక మొదట ₹10 లక్షల లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. అందులో భాగంగా ₹4 లక్షల లంచం స్వీకరిస్తూ ఏసీబీ అధికారులు ఆమెను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
తెలంగాణ ఏసీబీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ –ఏ ప్రభుత్వ ఉద్యోగి / సేవకుడు లంచం అడిగిన సందర్భంలో వెంటనే ఏసీబీని సంప్రదించాలని కోరింది.
📞 టోల్ ఫ్రీ నెంబర్: 1064
📲 వాట్సాప్: 9440446106
🌐 వెబ్‌సైట్: acb.telangana.gov.in
📌 సోషల్ మీడియా: Facebook (Telangana ACB), X (@TelanganaACB)
ఫిర్యాదుదారుల / బాధితుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.

Post a Comment