-->

భారత ఉపరాష్ట్రపతి గా సీపీ రాధాకృష్ణన్

భారత ఉపరాష్ట్రపతి గా సీపీ రాధాకృష్ణన్


భారత ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ ఘన విజయం సాధించారు. దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ (మంగళవారం) నిర్వహించిన పోలింగ్‌లో మొత్తం 781 మంది సభ్యుల్లో 767 మంది పార్లమెంటు సభ్యులు ఓటు వేశారు.

ఈ ఎన్నికల్లో ఎన్డీయే తరపున సీపీ రాధాకృష్ణన్ పోటీ చేయగా, విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి బరిలో నిలిచారు. అయితే భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్), బిజూ జనతా దళ్ (బిజేడీ), శిరోమణి అకాలి దళ్ (శి.అ.దళ్) సభ్యులు ఓటు వేయకుండా తటస్థంగా ఉన్నారు.

ఉపరాష్ట్రపతి పదవిని గెలుచుకోవడానికి కావలసిన మెజార్టీ 377 ఓట్లు కాగా, రాధాకృష్ణన్ 452 ఓట్లు సాధించారు. దీంతో ఆయన సునాయాసంగా విజయం సాధించి దేశానికి కొత్త ఉపరాష్ట్రపతిగా అవతరించబోతున్నారు.

మరోవైపు, విపక్షాల అభ్యర్థి బి. సుదర్శన్ రెడ్డి తక్కువ ఓట్లకే పరిమితమయ్యారు. ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 5 గంటలకు ముగియగా, ఓట్ల లెక్కింపు అనంతరం రాత్రి 7:30 గంటలకు ఫలితాలను ప్రకటించారు.

ఈ విజయంతో సీపీ రాధాకృష్ణన్ రాజకీయ జీవితం మరింత ఎత్తుకు చేరుకోనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793