15 వేలు లంచం తీసుకుంటు ఏసీబీకి చిక్కిన TGSPDCL ఎలక్ట్రిసిటీ లైన్‌మెన్
ఫిర్యాదుదారుని వ్యవసాయ క్షేత్రంలో ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయడానికి రూ.15,000 లంచం డిమాండ్ చేసిన నాగేంద్ర, డబ్బు స్వీకరిస్తుండగా తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు రంగంలోకి దిగి పట్టుకున్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఏ విధమైన లంచం కోరినా ప్రజలు వెంటనే అవినీతి నిరోధక శాఖకు సమాచారం అందించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
అవినీతి నిరోధక శాఖను సంప్రదించడానికి టోల్‌ఫ్రీ నంబర్ 1064, వాట్సాప్ 9440446106, ఫేస్‌బుక్ (Telangana ACB), ఎక్స్ (ట్విట్టర్) @TelanganaACB, వెబ్‌సైట్ acb.telangana.gov.in ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు.
అంతేకాకుండా, ఫిర్యాదుదారుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడుతాయని అధికారులు స్పష్టం చేశారు.
Post a Comment