-->

దస్తగిరి బాబా ఉర్సు ఉత్సవాలలో పాల్గొన్న మహబూబ్ జాని

దస్తగిరి బాబా ఉర్సు ఉత్సవాలలో పాల్గొన్న మహబూబ్ జాని


భద్రాద్రి కొత్తగూడెం :లక్ష్మీదేవిపల్లి మండలంలోని లోతువాగు గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న దస్తగిరి బాబా దర్గా వద్ద ఉర్సు ఉత్సవాలు సయ్యద్ చాంద్ బి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మతపెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ముస్లిం మైనార్టీ బీసీ ఈ ఫోర్ అధ్యక్షుడు మొహమ్మద్ మహబూబ్ జాని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ, “ముస్లిం మైనారిటీ సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు త్వరితగతిన అమలవ్వాలని అల్లాహ్‌ను ప్రార్థిస్తున్నాం” అని తెలిపారు.

దర్గా ప్రాంగణంలో భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సయ్యద్ చాంద్ బి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉత్సవాలు ఆధ్యాత్మిక వాతావరణంలో జాతి, మత భేదాలు లేకుండా అందరినీ ఆకట్టుకున్నాయి.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793