హరీశ్‌రావు ఇంట తీవ్ర విషాదం.. తండ్రి సత్యనారాయణ కన్నుమూత
బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి తన్నీరు సత్యనారాయణ మంగళవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. వయోభారం, అనారోగ్య సమస్యలతో కొంతకాలంగా బాధపడుతున్న సత్యనారాయణ ఆరోగ్యం క్షీణించడంతో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
సత్యనారాయణ స్వగ్రామం కరీంనగర్ జిల్లా కొత్తపల్లి. ప్రస్తుతం ఆయన పార్థివ దేహాన్ని హైదరాబాద్ కోకాపేట్‌లోని హరీశ్‌రావు నివాసం క్రిన్స్ విల్లాస్ వద్ద ప్రజల సందర్శనార్థం ఉంచారు. ఆయన భౌతికకాయాన్ని దర్శించేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ (K. Chandrashekar Rao), పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (K. T. Rama Rao), పలు బీఆర్ఎస్ నాయకులు, ఇతర రాజకీయ పార్టీ నేతలు సత్యనారాయణ మరణంపై తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
సత్యనారాయణ అంత్యక్రియలు కుటుంబ సభ్యుల సమక్షంలో స్వగ్రామం కొత్తపల్లిలో నిర్వహించే అవకాశం ఉందని సమాచారం.

Post a Comment