బీసీ సంఘాల ఐక్యతారాగం – రేపు బంద్‌కు పిలుపు
మెదక్, అక్టోబర్ 17: మెదక్ జిల్లాలో బీసీ సంఘాల ఉద్యమం ఉధృతమైంది. రాష్ట్ర వ్యాప్త బీసీ ఉద్యమంలో భాగంగా రేపు (శనివారం) బంద్ నిర్వహించాలని బీసీ సంఘాల నాయకులు నిర్ణయించారు. బంద్‌కు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని వారు పిలుపునిచ్చారు.
మెదక్ పట్టణంలోని టీఎన్‌జీఓల భవనంలో జరిగిన సమావేశంలో బీసీ రిజర్వేషన్ల అంశంపై విస్తృతంగా చర్చ జరిగింది. రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి స్థానికంగా మద్దతు కొనసాగించాలని నిర్ణయించారు.
నేతలు మాట్లాడుతూ, బీసీ రిజర్వేషన్లను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చి చట్టబద్ధ రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈడబ్ల్యూఎస్ (EWS) రిజర్వేషన్లకు లేని ఇబ్బందులు బీసీలకు ఎందుకు ఎదురవుతున్నాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.
సామాజికంగా వెనుకబడిన బీసీ వర్గాల హక్కుల కోసం అన్ని కులాలు ఏకం కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు కొండన్ సురేందర్ గౌడ్, చింతల నర్సింలు, శంకర్ గౌడ్, మామిళ్ల అంజనేయులు, రామస్వామి, క్రిష్ణ, మంగ మోహన్ గౌడ్, మహ్మద్ హఫీజ్, గౌస్ ఖురేషి, మరియు మానవ హక్కుల వేదిక నేత షెక్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
Post a Comment