-->

పొద్దుటూరులో విషాద ఘటన ఉరేసుకుని మహిళా లెక్చరర్ ఆత్మహత్య

పొద్దుటూరులో విషాద ఘటన ఉరేసుకుని మహిళా లెక్చరర్ ఆత్మహత్య


కడప జిల్లా అక్టోబర్ 26, 2025: కడప జిల్లా పొద్దుటూరు పట్టణంలో దుర్ఘటన చోటుచేసుకుంది. మానసిక ఆవేదనకు గురైన ఓ మహిళా లెక్చరర్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

పోలీసుల వివరాల ప్రకారం — ఈశ్వర్‌రెడ్డి నగర్‌కు చెందిన మహేశ్వరి (26) చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయింది. ఆమె తన తాత వద్ద అక్క కవితతో కలిసి పెరిగింది. ఇటీవల కవితకు వివాహం కావడంతో మహేశ్వరి తాత దగ్గరే ఉంటూ ఆయన బాగోగులు చూసుకుంటూ, చాపాడు మండలంలోని ఒక ప్రైవేట్ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తోంది.

పేరెంట్స్ లేకపోవడం, అక్క వివాహం తర్వాత ఒంటరితనం ఎక్కువై, మానసికంగా కుంగిపోయిన ఆమె ఆదివారం ఉదయం ఇంట్లో ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పొద్దుటూరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. అక్క కవిత ఫిర్యాదు మేరకు దర్యాప్తు కొనసాగుతోంది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793