-->

10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ వ్యవసాయ అధికారి

10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ వ్యవసాయ అధికారి


మహబూబాబాద్:చనిపోయిన రైతుకు ప్రభుత్వం నుంచి అందించే రైతు బీమా మంజూరు కోసం రూ.10వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి ఏఈఓ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుపడ్డాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ కేంద్రంలో గురువారం జరిగింది. వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మరిపెడ మండలంలోని అనే పురం గ్రామానికి చెందిన రైతు బిక్కు అక్టోబర్ 14 వ తేదీన మరణించాడు. దీంతో నామినీగా ఉన్న రైతు కుమారుడు రైతు బీమా కోసం గత నెల 30వ తేదీన అన్ని ధ్రువీకరణ పత్రాలతో మరిపెడ అగ్రికల్చర్ కార్యాలయంలో బీమాకు దరఖాస్తు చేసుకున్నాడు. ఈ క్రమంలోనే అనేపురం క్లస్టర్ ఏఈఓ గాడిపెళ్లి సందీప్ సదరు రైతు కుమారుడి వద్ద రూ. 20 వేలు ఇస్తేనే ధ్రువీకరణ పత్రాలు ఆన్లైన్ చేస్తానని డిమాండ్ చేసినట్లు తెలిపారు.

దీంతో సందీప్ లంచం మొత్తాన్ని స్వీకరిస్తూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కాడు. ఆయనను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టిన అధికారులు ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనతో స్థానిక వ్యవసాయ కార్యాలయంలో సంచలనం రేగింది.

ఏసీబీ అధికారులు ఈ కేసును నమోదు చేసి, వివరాలు ఉన్నతాధికారులకు నివేదించారు. లంచం తీసుకున్న అధికారి పై తదుపరి చర్యలు కొనసాగుతున్నట్లు సమాచారం.


🗞️ ముఖ్యాంశాలు:

  • రైతు బీమా ఫైల్ క్లియర్ కోసం రూ.10,000 లంచం డిమాండ్
  • ఏసీబీకి ఫిర్యాదు చేసిన బాధిత రైతు
  • రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ AEO సందీప్
  • విచారణలో ఏసీబీ అధికారులు ఆధారాలు సేకరణ


Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793