-->

1 లక్షా లంచం తీసుకుంటూ ఏసీబికి చిక్కిన సర్వేయర్, చైన్‌మెన్

1 లక్షా లంచం తీసుకుంటూ ఏసీబికి చిక్కిన సర్వేయర్, చైన్‌మెన్


హైదరాబాద్ జిల్లా సికింద్రాబాద్ మండల తహశీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదుదారునికి చెందిన ఒక ఆస్తికి సంబంధించి జారీ చేసిన నోటీసుపై ఎటువంటి ప్రతికూల చర్యలు తీసుకోకుండా ఉండేందుకు ఫిర్యాదుదారుని నుంచి రూ. 3,00,000/- లంచం డిమాండ్ చేసిన కేసులో, మొదటి విడతగా రూ. 1,00,000/- స్వీకరిస్తూ సికింద్రాబాద్ మండల తహశీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న మండల సర్వేయర్ కాలువ కిరణ్ కుమార్ మరియు చైన్‌మెన్ మేకల భాస్కర్ తెలంగాణ అవినీతినిరోధక శాఖ (ACB) అధికారులకు పట్టుబడ్డారు.

ఈ చర్యతో ప్రభుత్వ సేవలో లంచం, అవినీతి పట్ల తెలంగాణ ACB మరోసారి కఠినమైన వైఖరిని ప్రదర్శించింది.

ప్రజలకు ముఖ్య హెచ్చరిక / సమాచారం:

ఏ ప్రభుత్వ ఉద్యోగి లంచం అడిగినట్లయినా, ప్రజలు వెంటనే తెలంగాణ అవినీతినిరోధక శాఖను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు.

సంప్రదించగల టోల్ ఫ్రీ / సోషల్ మీడియా వివరాలు:

📞 టోల్ ఫ్రీ నెంబర్: 1064

📱 వాట్సాప్: 9440446106

📘 ఫేస్‌బుక్: Telangana ACB

🐦 ఎక్స్ (Twitter): @TelanganaACB

🌐 వెబ్‌సైట్: acb.telangana.gov.in

ఫిర్యాదుదారుల / బాధితుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయి.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793