-->

కులాంతర వివాహం మంటల్లో ప్రాణం… షాద్నగర్‌లో దారుణ హత్య

కులాంతర వివాహం మంటల్లో ప్రాణం… షాద్నగర్‌లో దారుణ హత్య


హైదరాబాద్, నవంబర్ 16: షాద్నగర్‌లో కులాంతర వివాహం పేరుతో తెగింపు హత్య వెలుగుచూసింది. ప్రేమపెళ్లికి అండగా నిలిచాడన్న కోపంతో యువతి బంధువులు ధారుణంగా హత్యకు తెగబడ్డారు. స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.

బాధితుల వివరాల ప్రకారం…
ఎల్లంపల్లి గ్రామానికి చెందిన చంద్రశేఖర్ ఇటీవల అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. పదిరోజుల క్రితం ఇద్దరూ ఇంటి పెద్దల అనుమతి లేకుండానే పెళ్లి చేసుకోవడంతో యువతి బంధువుల్లో ఆగ్రహం చెలరేగింది.

ఈ క్రమంలో చంద్రశేఖర్ వివాహానికి సహకరించాడని భావించి అతని అన్న రాజశేఖర్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. నవంబర్ 12న “మాట్లాడాల్సిన విషయం ఉంది” అంటూ రాజశేఖర్‌ను పిలిపించుకున్న యువతి బంధువులు అక్కడికక్కడే అతడిని ఘాతుకంగా కొట్టి హతమార్చినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు.

అంతటితో ఆగని దుండగులు రాజశేఖర్ మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పంటించి దహనం చేసినట్టు సమాచారం. సంఘటన చోటుచేసుకున్న తర్వాత కుటుంబ సభ్యులు షాద్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ మృత్యుఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కులాంధ్యంతో జరిగిన ఈ నేరంపై గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసు విభాగం నిందితుల కోసం గాలింపు చర్యలను వేగవంతం చేసింది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793