-->

జనజీవన స్రవంతిలోకి మరో 37 మంది మావోయిస్టులు?

జనజీవన స్రవంతిలోకి మరో 37 మంది మావోయిస్టులు?


హైదరాబాద్, నవంబర్ 22: తెలంగాణలో మావోయిస్టు ఉద్యమానికి మరో గట్టి ఎదురుదెబ్బ తగలబోతోందని సమాచారం. ఇటీవల వరుసగా జరిగిన అగ్రనేతల ఎన్కౌంటర్లతో తడబడుతున్న మావోయిస్టు పార్టీకి, మరో కీలక విఘాతం ఎదురవుతున్నట్లు అధికార వర్గాలు సూచిస్తున్నాయి.

తెలంగాణ డీజీపీ కార్యాలయం వద్ద భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోవడానికి సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. మొత్తం 37 మంది వరకు, అందులో ముఖ్య నేతలు, కేంద్ర–రాష్ట్ర కమిటీ సభ్యులు ఉన్నట్లు తెలుస్తోంది.

‘‘ఆపరేషన్ కాగార్’’తో మావోయిస్టులు తీవ్రమైన ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, ప్రభుత్వం ఇచ్చిన జనజీవన స్రవంతిలో కలవాలి… అభివృద్ధిలో భాగం కావాలి అనే పిలుపుకు స్పందిస్తూ లొంగుబాటు ప్రక్రియ వేగవంతమైందని అధికారులు భావిస్తున్నారు.

లొంగుబాటుకు సిద్ధమవుతున్న వారిలో మావోయిస్టు కీలక నేత ఆజాద్, అలాగే కొయ్యడ సాంబయ్య, అప్పాస్ నారాయణ, ఎర్రాలు వంటి కీలక కమిటీ సభ్యులు ఉన్నట్లు సమాచారం. ఈ సందర్భంగా, మధ్యాహ్నం 3 గంటలకు డీజీపీ శివధర్ రెడ్డి మీడియాకు అధికారిక వివరాలు వెల్లడించనున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793