వేములవాడ రాజన్న ఆలయానికి కార్తీకంలో రూ. 8.22 కోట్ల ఆదాయం
రాజన్న జిల్లా, నవంబర్ 22: తెలంగాణలో అత్యంత ప్రాచుర్యం పొందిన పుణ్యక్షేత్రాల్లో ఒకటైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి ఈ కార్తీకమాసంలో భారీగా ఆదాయం సమకూరింది. గత నెల రోజుల వ్యవధిలోనే ఆలయానికి మొత్తం రూ. 8.22 కోట్లు వచ్చినట్లు దేవస్థాన అధికారులు వెల్లడించారు.
కార్తీక దీపోత్సవాల సందర్భంగా లక్షలాది మంది భక్తులు స్వామివారి దర్శనార్థం వేములవాడకు తరలివచ్చారు. భక్తుల విరాళాలతో పాటు వివిధ సేవలు, టికెట్ విక్రయాల ద్వారా ఆలయ ఆదాయం గణనీయంగా పెరిగింది.
ఆదాయ వివరాలు:
- హుండీ ద్వారా: రూ. 4.22 కోట్లు
- కోడె టికెట్ల ద్వారా: రూ. 1.65 కోట్లు
- ప్రసాదాల ద్వారా: రూ. 1.73 కోట్లు
- రుద్రాభిషేకం టికెట్ల ద్వారా: రూ. 24.18 లక్షలు
- శీఘ్ర & బ్రేక్ దర్శనాల ద్వారా: రూ. 63.53 లక్షలు
- కల్యాణం టికెట్ల ద్వారా: రూ. 39.60 లక్షలు
- ఇతర సేవల ద్వారా: రూ. 66.73 లక్షలు
అధికారుల బెంచ్‌మార్క్ ప్రకారం, ఈ సంవత్సరం కార్తీకమాస ఆదాయం గత సంవత్సరాలతో పోల్చితే ఎక్కువగా నమోదయ్యిందని తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా అన్ని ఏర్పాట్లు సంక్రమంగా నిర్వహించామని, రాబోయే పర్వదినాలకు కూడా సన్నాహాలు పూర్తయ్యాయని చెప్పారు.

Post a Comment