తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ పసిడి పంచ్
హైదరాబాద్, నవంబర్ 21: ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్స్‌లో భారత బాక్సర్లు దడ పుట్టించారు. ముఖ్యంగా స్టార్ మహిళా బాక్సర్, తెలంగాణ గర్వకారణం నిఖత్ జరీన్ మరోసారి తన క్లాస్ ఏమిటో ప్రపంచానికి చాటి చెప్పింది. మహిళల 51 కేజీల విభాగంలో చైనీస్ తైపీ బాక్సర్ గవో యీ గ్జువాన్ పై 5-0 తేడాతో ఏకపక్ష విజయం సాధిస్తూ స్వర్ణం కైవసం చేసుకుంది.
మొదటి రౌండ్ నుంచే నిఖత్ దూకుడు
రింగ్‌లో అడుగుపెట్టిన క్షణం నుండి నిఖత్ దూకుడే కనిపించింది. ప్రత్యర్థి దాడులను అణచివేస్తూ, వరుస కౌంటర్ పంచ్‌లతో స్కోరు బోర్డ్‌పై ఆధిపత్యం చాటింది. ఇటీవల ప్రపంచ ఛాంపియన్‌షిప్ క్వార్టర్స్‌లో ఎదురైన ఓటమి తర్వాత ఈ స్వర్ణంతో నిఖత్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చిందని అభిమానులు భావిస్తున్నారు.
ఇతర మహిళా విభాగాల్లో కూడా భారత పసిడి దండయాత్ర
57 కేజీలు – జైస్మిన్ లాంబోరియా
చైనీస్ తైపీ స్టార్, పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత వు యీపై జైస్మిన్ అద్భుత కౌంటర్ పంచ్‌లతో విజయం.
60 కేజీలు – పర్వీన్ హుడా
జపాన్‌కు చెందిన తగుచి అయాకాపై మూడు రౌండ్ల పాటు దూకుడుగా పోరాడి స్వర్ణం.
80 కేజీలు – నుపుర్ షెరోన్
ఉజ్బెకిస్థాన్ బాక్సర్ సొటిమ్‌బొయెవాపై జయంతో పసిడి.
70 కేజీలు – అరుంధతి చౌదరి
ఉజ్బెకిస్థాన్‌కు చెందిన అజీజాపై పవర్ పంచ్‌లతో ఆధిపత్యం.
54 కేజీలు – ప్రీతి పన్వర్
ఇటలీ బాక్సర్ సిరిన్ను ఓడించి స్వర్ణం.
48 కేజీలు – మీనాక్షి హుడా
ఉజ్బెక్ బాక్సర్ ఫోజిలివాపై విజయం సాధించి మరొక పసిడి భారత్ ఖాతాలో వేసింది.
పురుషుల విభాగంలో రెండు స్వర్ణాలు
పురుషుల బాక్సింగ్ విభాగంలోనూ భారత్ మెరుపులు చూపింది.
70 కేజీలు – హితేశ్ గులియా
కజకిస్థాన్ బాక్సర్ నార్‌బెక్పై గెలిచి స్వర్ణం.
60 కేజీలు – సచిన్ సివాచ్
కిర్గిజ్‌స్తాన్‌కు చెందిన మునార్‌బెక్పై గెలిచి మరో పసిడి భారత్‌కు అందించాడు.
మొత్తం 9 స్వర్ణాలతో భారత దళం సత్తా
మహిళలు–పురుషులు కలిపి మొత్తం 9 స్వర్ణ పతకాలు కైవసం చేసుకుని భారత బాక్సర్లు ప్రపంచ వేదికపై తమ ధైర్యాన్ని, నైపుణ్యాన్ని చాటారు.

Post a Comment