సూర్యాపేట–జనగామ హైవేపై కారు బీభత్సం… కానిస్టేబుల్ సహా ముగ్గురికి తీవ్ర గాయాలు
సూర్యాపేట: సూర్యాపేట–జనగామ నేషనల్ హైవేపై నాగారం బంగ్లా సమీపంలో సోమవారం రాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వాహనాల తనిఖీలు కొనసాగుతున్న సమయంలో అదుపు తప్పిన ఓ కారు బీభత్సం సృష్టించింది. అతి వేగంగా దూసుకొచ్చిన కారు అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసులను ఢీకొట్టింది.
ఈ ఘటనలో కానిస్టేబుల్‌తో పాటు మరో ఇద్దరు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. అలాగే కారు ఢీకొట్టిన మరో బైక్ కూడా తీవ్ర నష్టం చెందింది. వెంటనే అక్కడే ఉన్న పోలీసులు గాయపడిన వారిని సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో కానిస్టేబుల్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.
ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ వాహనాన్ని అక్కడే వదిలి పరారైనట్టు పోలీసులు తెలిపారు. కారు నంబర్ ఆధారంగా కేసు నమోదు చేసి, పారిపోయిన నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అధికారులు ప్రమాదంపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Post a Comment