ఆగి ఉన్న ఇసుక లారీని ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు డీ ఇద్దరు డ్రైవర్ల నిర్లక్ష్యంతో ఇద్దరి ప్రాణాలు బలి
వరంగల్ – హైదరాబాద్ జాతీయ రహదారి (NH–163) పై ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాల్లో శోకచాయలను మిగిల్చింది. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడికొండ సమీపంలో ఆగి ఉన్న ఇసుకలారీని ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు వెనుక నుండి ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
పోలీసుల వివరాల ప్రకారం, TG07UK5469 నెంబర్ గల ఇసుక లారీని డ్రైవర్ అజాగ్రత్తగా రహదారిపై పార్క్ చేసి ఉంచాడు. వేగంగా ప్రయాణిస్తున్న TG03Z0046 నెంబర్ గల రాజధాని సూపర్ లగ్జరీ బస్సు డ్రైవర్ ఆ లారీని గమనించకపోవడంతో బస్సు భారీగా ఢీ కొట్టింది. ఢీకొన్న ప్రభావంతో బస్సు ఎడమ వైపు భాగం పూర్తిగా ధ్వంసమైంది.
ఈ ప్రమాదంలో బస్సు ఎడమవైపు కూర్చున్న ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో దిండిగల్‌కు చెందిన పులమాటి ఓం ప్రకాష్ (75), హనుమకొండ బాలసముద్రం ప్రాంతానికి చెందిన నవదీప్ సింగ్‌లను గా గుర్తించారు. మరో ఆరుగురు ప్రయాణికులు తీవ్రమైన గాయాలు పొందగా, వారిని వెంటనే ఎంజీఎం హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
లారీ డ్రైవర్ నిర్లక్ష్యపు పార్కింగ్, బస్సు డ్రైవర్ అజాగ్రత్త — ఈ ఇద్దరి నిర్లక్ష్యాలే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో నిర్ధారించారు. ఇరు వాహనాల డ్రైవర్లను అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

Post a Comment