-->

దుండిగల్ మహిళ హత్య కేసులో వివాహేతర సంబంధమే కారణమని నిర్ధారణ

దుండిగల్ మహిళ హత్య కేసులో వివాహేతర సంబంధమే కారణమని నిర్ధారణ


మేడ్చల్ జిల్లా దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రీన్ హిల్స్ కాలనీలో చోటుచేసుకున్న మహిళ హత్య కేసులో కొత్త విషయాలు వెలుగుచూశాయి.

స్వాతి (21) అనే వివాహిత తన భర్తతో విబేధాల నేపథ్యంలో కొడుకుతో కలిసి దుండిగల్ ప్రాంతంలో నివాసం ఉంటూ, ఇంటి యజమాని కిషన్‌తో వివాహేతర సంబంధం కొనసాగించినట్టు పోలీసులు దర్యాప్తులో తేల్చారు.

ఈ వ్యవహారం కుటుంబ సభ్యుల మధ్య పలుమార్లు గొడవలకు దారి తీసింది. చివరికి శనివారం ఉదయం స్వాతి నివాసానికి వెళ్లిన ఆమె మామకోడలు రాజేష్, చిన్నారి కళ్ల ముందే స్వాతిని గొంతు కోసి హతమార్చాడు.

తరువాత స్వయంగా పోలీసులకు లొంగిపోయిన రాజేష్, తన కుటుంబంలో కలహాలకు స్వాతి కారణమని, ఆమె ఇంటి యజమాని కిషన్‌తో అనుచిత సంబంధం పెట్టుకున్నందున ఆగ్రహంతో హత్య చేశానని విచారణలో వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు.

అయితే, ఈ హత్య వెనుక కిషన్ పాత్ర ఉందా? లేక రాజేష్ ఏకపక్షంగా ఈ నేరానికి పాల్పడ్డాడా? అనే కోణాల్లో దుండిగల్ పోలీసులు విచారణను మరింత ముమ్మరం చేశారు.🔹 ప్రాంతంలో తీవ్ర కలకలం రేపిన ఈ హత్య కేసు, స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793