-->

ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన తుఫాన్‌.. ఒకరు మృతి

ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన తుఫాన్‌.. ఒకరు మృతి


సంగారెడ్డి జిల్లా కంది మండలం కవలంపేట వద్ద ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన తుఫాన్‌ వాహనం ముందు వెళ్తున్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని అత్యవసర చికిత్స కోసం సంగారెడ్డి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ప్రమాదం తీవ్రత కారణంగా తుఫాన్‌ వాహనం ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది.

గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతుడు, గాయపడిన వారి వివరాలు ఇంకా వెల్లడికావాల్సి ఉందని అధికారులు తెలిపారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793