సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ‘కోట్ల’ కుంభకోణం ఏసీబీ దాడుల్లో సంచలనాలు
రోజుకు రూ.5 లక్షల దోపిడీ.! డాక్యుమెంట్ రైటర్ల చేతిలోనే మొత్తం ‘సిస్టమ్’
➡️ రిజిస్ట్రేషన్ అంటే లంచం.. లిటిగేషన్ ఉంటే లక్షలు తప్పవు
➡️ ఏసీబీ రైడ్స్‌తో నిండా భయాందోళన – సిబ్బందే సామూహిక సెలవుల బెదిరింపులు*
*రాష్ట్రం మొత్తం కలవరపరిచిన ఏసీబీ రైడ్స్
స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖలో నెలకొన్న అవినీతి వ్యవస్థ ఎంత లోతు పట్టుకుందో ఏసీబీ ఒక్క రోజునే బయటపెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరిగిన ఆకస్మిక తనిఖీలు అధికారులు కూడా నమ్మలేని వాస్తవాలను వెలికితీశాయి.
రోజుకు కనీసం రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకూ అక్రమ ఆదాయం...!మొత్తం డాక్యుమెంట్ రైటర్లు, దళారులు, సిబ్బంది – రాజకీయ అండతో నడిచే ముఠా.
ప్రతి రిజిస్ట్రేషన్‌కు ‘ట్యారిఫ్’ – ఏరియావారీగా లంచ రేట్లు
- సాధారణ రిజిస్ట్రేషన్‌కే రూ.5,000 – రూ.20,000
- నగరాలు, విలువైన భూములైతే ఇంకా భారీ రేట్లు
- చిన్న లిటిగేషన్ ఉన్నా లంచం వేలల్లో కాదు… లక్షల్లోనే
- లంచం ఇచ్చేదాకా ఫైలు ఒక్క అంగుళం కూడా కదలదు
ప్రైవేట్ వ్యక్తుల ‘రాజ్యం’ – అధికారులు కేవలం సంతక యంత్రాలు
ఏసీబీ తనిఖీల్లో బయటపడిన షాకింగ్ నిజాలు:
- ఆఫీస్ లోపల ఉండే పనులన్నీ బయట ప్రైవేట్ వ్యక్తులే నియంత్రణ
- రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ప్రతి దశకూ ‘కొత్త రేట్లు’
- ఒక డాక్యుమెంట్ రైటర్ రోజుకు లక్షల్లో సంపాదిస్తున్నట్టు అంగీకారం
- వసూలైన మొత్తం "వాటా పద్దతిలో" సంబంధిత అధికారులకు డెలివరీ
ఏసీబీ దాడులు పెరిగితే… ఉద్యోగులే బెదిరింపులు!
దాడులు, తనిఖీలు ఇదే వేగంతో కొనసాగితే విధులకు రాకుండా“సామూహిక సెలవుకు వెళ్తాం” అని సిబ్బంది ప్రభుత్వం ఎదుటే హెచ్చరికలు పెట్టడం చర్చనీయాంశం.
అన్నీ సక్రమంగా ఉన్నా… లంచం తప్పదు!
పత్రాలు పర్ఫెక్ట్‌గా ఉన్నా, భూమికి వివాదం లేకపోయినా:“మినిమమ్ఇవ్వాల్సిందే” “ఇవ్వకపోతే ఫైల్ ఆగిపోతుంది…”అనే డైలాగ్‌తో కప్పం వసూలు స్పష్టంగా బయటపడింది.

Post a Comment