భద్రాద్రి కొత్తగూడెంలో ఘోర రోడ్డు ప్రమాదం పలువురు ప్రయాణికులకు తీవ్రగాయాలు
భద్రాది జిల్లా: నవంబర్ 21: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామం సమీపంలో ఈరోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అశ్వరావుపేట నుంచి ఖమ్మం దిశగా వేగంగా వస్తున్న టాటా ఏసీ వాహనం నియంత్రణ కోల్పోయి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సును ఢీకొట్టింది.
దీంతో బస్సులోని పలువురు ప్రయాణికులు తీవ్రమైన గాయాలతో రోడ్డు మీద పడిపోయారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రులను బయటకు తీసి పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. ప్రమాదం అశ్వరావుపేట–ఖమ్మం ప్రధాన రహదారిపై జరగడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు ధ్వంసమైన వాహనాలను క్రేన్ సహాయంతో తొలగిస్తూ, ట్రాఫిక్‌ను సజావుగా మార్చేందుకు చర్యలు చేపట్టారు.
ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Post a Comment