-->

మరోసారి మానవత్వం చాటుకున్న ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

మరోసారి మానవత్వం చాటుకున్న ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు


భూపాలపల్లి జిల్లా, నవంబర్ 15: రోడ్డుప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తిని తిరిగి ప్రాణాలతో నిలబెట్టే చర్యల్లో ముందుండి చొరవ చూపుతూ తెలంగాణ రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు.

స్థానికుల సమాచారం ప్రకారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం శివారులోని పెట్రోల్ పంప్ దగ్గర శనివారం సాయంత్రం బైక్‌ను వేగంగా వచ్చిన టిప్పర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి.

ఈ సమయంలో మంథని నియోజకవర్గంలోని కాటారం మండలంలో కార్యక్రమాలు ముగించుకొని అక్కడి నుండి ప్రయాణిస్తున్న మంత్రి శ్రీధర్ బాబు ప్రమాదాన్ని గమనించి వెంటనే తన కాన్వాయ్‌ను ఆపించారు. క్షతగాత్రుడి వద్దకు వెళ్లి ఆదుకునే ప్రయత్నం చేశారు. అతనికి ధైర్యం చెప్పడంతో పాటు తక్షణమే ఆస్పత్రికి తరలించాలని అధికారులను ఆదేశించారు.

బాధితుడికి అవసరమైనంత మెరుగైన వైద్యం అందేలా వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తానని మంత్రి హామీ ఇవ్వడం స్థానికులను ఎంతో ఆకట్టుకుంది. ప్రమాదస్థలంలో చూపిన ఆయన స్పందన, మానవత్వం ప్రజల ప్రశంసలు అందుకుంది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793