-->

జనవరి 3 నుంచి టెట్ ఆన్‌లైన్ పరీక్షలు

15 సెషన్లలో కంప్యూటర్ ఆధారిత పరీక్షలు – విద్యాశాఖ షెడ్యూల్ విడుదల


హైదరాబాద్‌, డిసెంబర్‌ 17: తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET–2026)కు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను పాఠశాల విద్యా విభాగం మంగళవారం సాయంత్రం విడుదల చేసింది. ఈసారి టెట్‌కు పేపర్–1, పేపర్–2లకు కలిపి మొత్తం 2.37 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

టెట్ పరీక్షలు జనవరి 3, 2026 నుంచి జనవరి 20, 2026 వరకు నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కేవలం 9 రోజుల్లో, మొత్తం 15 సెషన్లలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) విధానంలో ఈ పరీక్షలు జరుగనున్నాయి.

రెండు సెషన్లలో పరీక్షలు

ప్రతిరోజు పరీక్షలు రెండు సెషన్లలో నిర్వహించనున్నారు.

  • మొదటి సెషన్: ఉదయం 9:00 గంటల నుంచి 11:30 గంటల వరకు
  • రెండో సెషన్: మధ్యాహ్నం 2:00 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు

ప్రతి సెషన్‌కు అభ్యర్థులకు 2 గంటల 30 నిమిషాల సమయం కేటాయించారు.

జిల్లా వారీ షెడ్యూల్ ఆన్‌లైన్‌లో

జిల్లాల వారీగా ఏ తేదీన ఏ జిల్లా అభ్యర్థులకు పరీక్షలు జరుగుతాయనే పూర్తి వివరాలను పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. అభ్యర్థులు తమ పరీక్షా తేదీ, సమయం, పరీక్షా కేంద్రం వివరాలు తెలుసుకునేందుకు వెబ్‌సైట్‌ను సందర్శించి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

పరీక్షా షెడ్యూల్‌ను దృష్టిలో ఉంచుకుని అభ్యర్థులు ముందుగానే సిద్ధమై, పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకోవాలని విద్యాశాఖ కోరింది.


టెట్ ఎగ్జామ్ 2026 షెడ్యూల్

  • జనవరి 3:
    పేపర్–2 (మ్యాథమాటిక్స్ & సైన్స్) – రెండు సెషన్లు

  • జనవరి 4:
    పేపర్–2 (మ్యాథమాటిక్స్ & సైన్స్) – రెండు సెషన్లు

  • జనవరి 5:
    పేపర్–2 (సోషల్ స్టడీస్) – రెండు సెషన్లు

  • జనవరి 6:
    పేపర్–2 (సోషల్ స్టడీస్) – రెండు సెషన్లు

  • జనవరి 8:
    పేపర్–1 – రెండు సెషన్లు

  • జనవరి 9:
    పేపర్–1 – ఒక్క సెషన్

  • జనవరి 11:
    పేపర్–1 – రెండు సెషన్లు

  • జనవరి 19:
    పేపర్–1 (మైనర్) – ఒక్క సెషన్

  • జనవరి 20:
    పేపర్–2 (మ్యాథమాటిక్స్ & సైన్స్ / సోషల్ స్టడీస్) – ఒక్క సెషన్

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793