ఫోన్‌పే ద్వారా రూ.9,000 లంచం తీసుకోని ఏసీపీ కి చిక్కిన ఆరోగ్య కేంద్రం ఇన్‌ఛార్జి
నిర్మల్ జిల్లా | భైంసా మండలం : ఫిర్యాదిదారుని జీపీఎఫ్, సరెండర్ లీవ్, ఎఫ్‌టీఏ బిల్లులు తయారు చేయడం తో పాటు మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులను సిద్ధం చేయడానికి లంచం డిమాండ్ చేసిన ప్రభుత్వ ఉద్యోగి చివరకు తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) వలకు చిక్కాడు.
నిర్మల్ జిల్లా భైంసా మండలం తానూర్ ప్రభుత్వ ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం ఇన్‌ఛార్జిగా పనిచేస్తున్న జి. భీమన్న, అలాగే బాసర ప్రాథమిక వైద్యశాలలోని సీనియర్ అసిస్టెంట్, ఫిర్యాదిదారుని నుంచి రూ.9,000 లంచాన్ని ఫోన్‌పే ద్వారా స్వీకరించినట్లు అనిశా అధికారులు గుర్తించారు.
అనిశా వలలో పట్టుబడ్డ ఉద్యోగి
ఫిర్యాదిదారు ఇచ్చిన సమాచారం మేరకు ముందుగా ప్రణాళిక రూపొందించిన అనిశా అధికారులు, లంచం లావాదేవీ జరిగిన వెంటనే అధికారిని అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణలో లంచం తీసుకున్నట్లు ఆధారాలు లభించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
లంచం అడిగితే వెంటనే ఫిర్యాదు చేయండి
ప్రభుత్వ సేవల కోసం ఎవరైనా ఉద్యోగి లంచం డిమాండ్ చేసినట్లయితే ప్రజలు వెంటనే తెలంగాణ అవినీతి నిరోధక శాఖను సంప్రదించాలని అనిశా అధికారులు సూచించారు.
ఫిర్యాదుదారులు, బాధితుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని అనిశా స్పష్టం చేసింది.

Post a Comment