-->

తెలంగాణ రాజ్ భవన్‌కు కొత్త పేరు — లోక్ భవన్!*

తెలంగాణ రాజ్ భవన్‌కు కొత్త పేరు — లోక్ భవన్!*


హైదరాబాద్: డిసెంబర్ 02: తెలంగాణలోని రాజ్ భవన్‌కి నూతన నామకరణం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేస్తూ ‘రాజ్ భవన్’ పేరును *‘లోక్ భవన్’*గా మార్చింది. దేశవ్యాప్తంగా గవర్నర్ల అధికారిక నివాసాలకు పేరు మార్చాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించిన నేపథ్యంలో తెలంగాణ ఈ నిర్ణయం తీసుకుంది.

కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి పలు కీలక పరిపాలనా సంస్కరణలను కొనసాగిస్తోంది. అందులో భాగంగానే గవర్నర్‌ల నివాస భవనాల పేర్లలో మార్పు చేపట్టింది.

‘ప్రజా సేవ’ అనే ప్రభుత్వ నినాదానికి అనుగుణంగా ఇకపై దేశంలోని అన్ని రాష్ట్రాల్లో రాజ్ భవన్‌కి బదులుగా లోక్ భవన్ అనే పేరు ఉపయోగించాలన్న నిర్ణయాన్ని కేంద్ర హోంశాఖ గత నెల 25న జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. దేశంలో ఎక్కడైనా ‘రాజ్ భవన్’ అనే పదం అధికారికంగా వాడరాదని కూడా పేర్కొంది.

అధికారవర్గాల సమాచారం మేరకు రాజ్యాంగ వ్యవస్థలో గవర్నర్ పదవి రాజన్యతకు ప్రతీక కాదని, ప్రజాస్వామ్య విలువలను ప్రతిబింబించే స్థాయిలో ఉండాలనే ఉద్దేశంతో ‘లోక్ భవన్’ అనే పేరును ఎంపిక చేశారని తెలిపారు. ఈ మార్పుతో గణతంత్ర, ప్రజాస్వామ్య సిద్ధాంతాలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా కేంద్రం భావిస్తోంది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793