-->

బాచుపల్లిలో ఇద్దరు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య… కుటుంబాల్లో విషాదం

బాచుపల్లిలో ఇద్దరు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య… కుటుంబాల్లో విషాదం


హైదరాబాద్, డిసెంబర్ 02: నగరంలోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. వేర్వేరు కళాశాలల్లో చదువుతున్న ఈ ఇద్దరూ ఇలా బలవన్మరణానికి పాల్పడటంతో వారి కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్య

బాచుపల్లిలోని శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న 16 ఏళ్ల యువతి కళాశాల హాస్టల్‌లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె స్వస్థలం మక్తల్‌, మహబూబ్ నగర్ జిల్లా.

ఆమె ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. హోస్టల్ నిర్వాహకులు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. యువతి మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు.


ప్రగతినగర్‌లో ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థి మృతదేహం

ఇంకో ఘటనలో ప్రగతినగర్‌లోని ప్రగతి జూనియర్ కాలేజీలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి తన ఇంట్లోనే ఉరివేసుకుని మృతిచెందాడు. ఈ ఘటనపై కూడా స్పష్టమైన కారణాలు తెలియరాలేదు.

స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని శవాన్ని గాంధీ హాస్పిటల్ మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తోంది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793