క్రైస్తవులకు సీఎం రేవంత్ రెడ్డి క్రిస్మస్ శుభాకాంక్షలు
తెలంగాణ: క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని రాష్ట్రంలోని క్రైస్తవ సోదరసోదరీమణులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఏసు ప్రభువు బోధించిన ప్రేమ, కరుణ, శాంతి మార్గాలు సమస్త మానవాళికి ఎల్లప్పుడూ దిక్సూచిగా నిలుస్తాయని సీఎం పేర్కొన్నారు.
క్రీస్తు ఉపదేశాలను ఆదర్శంగా తీసుకుని అన్ని మతాల సంక్షేమం, సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా తమ ప్రజా ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తోందని తెలిపారు. రాష్ట్రంలో మతసామరస్యాన్ని కాపాడుతూ, ప్రతి వర్గం అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
క్రైస్తవ మైనారిటీల అభివృద్ధి, సంక్షేమానికి అవసరమైన అన్ని చర్యలు చేపడతామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. క్రిస్మస్ పండుగ రాష్ట్ర ప్రజలందరి జీవితాల్లో ఆనందం, శాంతి, సమృద్ధిని తీసుకురావాలని ఆకాంక్షించారు.

Post a Comment