లయన్స్ క్లబ్ ఆఫ్ కొత్తగూడెం మిలీనియం ఆధ్వర్యంలో సంగం వెంకట పుల్లయ్య పుట్టినరోజు వేడుకలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: లయన్ సంగం వెంకట పుల్లయ్య RTA BCM గారి పుట్టినరోజు సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ కొత్తగూడెం మిలీనియం సభ్యులు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సామాజిక సేవలో భాగంగా ఒక మొక్కను నాటుతూ పర్యావరణ పరిరక్షణకు సంకల్పం వ్యక్తం చేశారు.
అలాగే, వికలాంగులకు సహాయం చేయాలనే దృక్కోణంతో ఒక వీల్‌చెయర్‌ను అందించాలని లయన్స్ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. అనంతరం వెంకట పుల్లయ్య గారి నివాసంలో ప్రత్యేకంగా కేక్ కట్ చేయించి పుట్టినరోజు వేడుకను కొనసాగించారు.
ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ కొత్తగూడెం మిల్లీనియం అధ్యక్షుడు లయన్ బొక్క శ్రీనివాస్, ట్రెజరర్ పగడాల నగేష్, లయన్ పితాని సత్యనారాయణ, లయన్ సత్తులూరి సత్యనారాయణ, లయన్ జేబీ మోహన్, డి. రాజయ్య, లయన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment