మైసూర్ ప్యాలెస్ సమీపంలో భారీ పేలుడు ఒకరు స్పాట్‌డెడ్.. నలుగురికి తీవ్ర గాయాలు
బెంగుళూరు: కర్ణాటకలో గురువారం (డిసెంబర్ 25) రాత్రి భారీ పేలుడు సంభవించింది. చారిత్రాత్మక మైసూర్ ప్యాలెస్ సమీపంలో బెలూన్ గ్యాస్ సిలిండర్ అకస్మాత్తుగా పేలింది.
ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటన సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, అత్యవసర వైద్య బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.
గాయపడిన వారిని వెంటనే సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పేలుడుకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఘటనతో ఆ ప్రాంతంలో కొంతసేపు భయాందోళన నెలకొంది.

Post a Comment