-->

సంగారెడ్డి జిల్లాలో జంట హత్యల కలకలం

సంగారెడ్డి జిల్లాలో జంట హత్యల కలకలం


సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకున్న జంట హత్యలు తీవ్ర సంచలనం సృష్టించాయి. తెల్లాపూర్ పరిధిలో తల్లి, కుమారుడిని దారుణంగా హత్య చేసిన ఘటన స్థానికులను భయాందోళనకు గురిచేసింది.

పోలీసుల వివరాల ప్రకారం… ఐదు రోజుల క్రితం శివరాజ్, చంద్రకళ ఇద్దరూ భార్యాభర్తలుగా పరిచయం చేసుకుంటూ తెల్లాపూర్‌కు వచ్చారు. అయితే వీరి మధ్య ఉన్న వివాహేతర సంబంధమే ఈ హత్యలకు కారణమై ఉండొచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు.

ఈ క్రమంలో శివరాజ్, చంద్రకళతో పాటు ఆమె 13 ఏళ్ల కుమారుడిని కూడా హత్య చేసినట్లు సమాచారం. అనంతరం శివరాజ్ తన గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలపాలైన శివరాజ్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. జంట హత్యలకు గల పూర్తి కారణాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. ఈ ఘటనతో తెల్లాపూర్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో తీవ్ర కలకలం నెలకొంది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793