-->

బీజాపూర్–దంతేవాడ సరిహద్దులో భారీ ఎన్‌కౌంటర్

బీజాపూర్–దంతేవాడ సరిహద్దులో భారీ ఎన్‌కౌంటర్ 12 మంది మావోయిస్టులు హతం – ముగ్గురు DRG సిబ్బంది వీరమరణం


ములుగు జిల్లా, డిసెంబర్ 03: బీజాపూర్–దంతేవాడ అంతర్‌ జిల్లా సరిహద్దులోని పశ్చిమ బస్తర్ డివిజన్‌లో ఈరోజు సాయంత్రం భద్రతా దళాలు మావోయిస్టులపై విస్తృత స్థాయిలో నక్సల్ వ్యతిరేక ఆపరేషన్ కొనసాగించాయి. గుర్తించిన మావోయిస్టుల దాచుబండ్లపై ప్రారంభించిన ఈ ఆపరేషన్‌లో భారీ కాల్పులు జరిగాయి.

12 మంది మావోయిస్టులు హతం

ఇప్పటి వరకు జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు అధికారులు నిర్ధారించారు. మృతుల కేడర్ల మృతదేహాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. అయితే, ఘర్షణ ప్రాంతంలో ఇంకా కొందరు మావోయిస్టులు దాగి ఉండే అవకాశం ఉన్నందున సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.

మూడు DRG సిబ్బంది వీరమరణం

ఎదురు కాల్పుల్లో ముగ్గురు బీజాపూర్ DRG సిబ్బంది వీరమరణం పొందారు.
వీరిని క్రింది విధంగా గుర్తించారు:

  • హెడ్ కానిస్టేబుల్ మోను వాడారి
  • కానిస్టేబుల్ దుకారు గొండే
  • జవాన్ రమేష్ సోడి

అదనంగా మరొక ఇద్దరు DRG సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిని తక్షణమే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఆయుధాల స్వాధీనం

సంఘటన స్థలంలో పోలీసులు

  • SLR రైఫిల్స్,
  • 303 రైఫిల్స్
    మరియు ఇతర పేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

భారీ బలగాల మోహరింపు

పశ్చిమ బస్తర్ అటవీ ప్రాంతంలో ప్రస్తుతం నిరంతర కాంబింగ్ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. అదనపు భద్రతా బలగాలను మోహరిచారు. ఈ ఆపరేషన్‌లో DRG, STF, కోబ్రా కమాండోలు కలిసి పాల్గొంటున్నాయి. అధికారుల వివరాల ప్రకారం, ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793